Sat Dec 06 2025 00:49:12 GMT+0000 (Coordinated Universal Time)
బాలకృష్ణ మిస్సింగ్ అంటూ?
ఎమ్మెల్యే బాలకృష్ణ ఆందోళనలకు హాజరు కావడం లేదంటూ బీజేపీ నేతలు పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ అంటూ ఫిర్యాదు చేశారు.

హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. అన్ని పక్షాలు కలసి నిన్న హిందూపురంలో బంద్ ను కూడా నిర్వహించాయి. అయితే ఈరోజు ఎమ్మెల్యే బాలకృష్ణ ఆందోళనలకు హాజరు కావడం లేదంటూ బీజేపీ నేతలు పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ అంటూ ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణ తో పాటు ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ లు కనపడటం లేదంటూ బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు....
హిందూపురంను జిల్లాగా ప్రకటించినా జిల్లా కేంద్రం మాత్రం పుట్టపర్తిగా నిర్ణయించారు. సత్యసాయి జిల్లాగా పేరు పెట్టనున్నారు. సత్యసాయి పేరు పెట్టడంపై తమకు అభ్యంతరం లేదని, జిల్లా కేంద్రాన్ని మాత్రం హిందూపురంలో పెట్టాలని స్థానికులు ఆందోళనకు దిగారు. ఎమ్మల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు స్పందించి దీనిపై ప్రభుత్వంపై వత్తిడి తేవాలని బీజేపీ నేతలు కోరుతున్నారు.
Next Story

