Fri Dec 05 2025 23:47:30 GMT+0000 (Coordinated Universal Time)
మరోవివాదాన్ని రాజేసిన ఏపీ బీజేపీ
గుంటూరులోని జిన్నా టవర్ సెంటర్ పేరును బీజేపీ నేతలు వివాదంగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.

బీజేపీ నేతలకీ కాలు చేయీ ఆడకపోయినా నోరు మాత్రం ఊరుకోదు. పాత విషయాలన్నీ వెలికితీసి ఏదో ఒకరకంగా మైలేజీ పొందాలని ప్రయత్నిస్తారు. ఇప్పుడు తాజాగా గుంటూరులోని జిన్నా టవర్ సెంటర్ పేరును బీజేపీ నేతలు వివాదంగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. గుంటూరులో జిన్నా టవర్ సెంటర్ ఫేమస్. దశాబ్దాలుగా జిన్నా టవర్ సెంటర్ ఉన్నా, 2014లో అధికార పార్టీతో కలసి ప్రభుత్వంలో ఉన్నా జిన్నా టవర్ ను పట్టించుకోని బీజేపీ నేతలు ఆ పేరు మార్చాలని డిమాండ్ చేస్తుండటం విశేషం.
జిన్నా టవర్ పేరును....
బీజేపీ నేత సత్యకుమార్ దీనిపై ట్వీట్ చేసి వివాదనికి మూలమయ్యారు. తర్వాత వెనువెంటనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సయితం జిన్నా టవర్ పేరును తొలగించాలని డిమాండ్ చేశారు. దేశ విభజనకు కారణమైన ద్రోహి జిన్నా పేరు పెట్టడమేంటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జిన్నా పేరును తొలగించి వారి స్థానంలో అబ్దుల్ కలాం పేరు కాని, మరో జిల్లా నేత పేరు కాని పెట్టాలని వారు కోరుతున్నారు.
Next Story

