Sat Dec 06 2025 00:22:12 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన ఈరోజు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించారు. ఈరోజు మంచి ముహూర్తం ఉండటంతో తాను నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. తాను బీజేపీ అభ్యర్థిగానే బరిలోకి దిగుతానని ఆయన తెలిపారు.
టిక్కెట్ తనదేనన్న ధీమాతో...
తొలుత స్థానిక వెంకటేశ్వరస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన విష్ణుకుమార్ రాజు ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే ఏపీలో ఇప్పటి వరకూ పొత్తులు తేలలేదు. టీడీపీ, జనసేన కూటమి మాత్రమే అధికారికంగా ఖరారయింది. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందా? పొత్తులతో వెళుతుందా? అన్నది తేలలేదు. ఒంటరిగా పోటీ చేస్తే సరే.. కూటమిలో చేరితే టిక్కెట్ వస్తుందా? రాదా? అన్నది ఆలోచించకుండా ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కూడా పాల్గొనడం విశేషం.
Next Story

