Sun Mar 08 2026 00:15:37 GMT+0530 (India Standard Time)
పొత్తులపై టీజీ క్లారిటీ ఇచ్చారుగా
బీజేపీ నేత టీజీ వెంకటేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్లులపై ఆయన క్లారిటీ ఇచ్చారు.

బీజేపీ నేత టీజీ వెంకటేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒకవైపు బీజేపీతో ఉన్నారని, మరోవైపు టీడీపీకి దగ్గరవుతున్నారని అన్నారు. ఇటీవల చంద్రబాబు, పవన్ ల భేటీపై ఆయన మాట్లాడారు. పొత్తులపై వారిద్దరూ ఇంకా చర్చించి ఉండకపోవచ్చని టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు.
ఆరు నెలల ముందే...
పొత్తులపై ఆరు నెలలకు ముందు మాత్రమే క్లారిటీ వస్తుందని ఆయన తెలిపారు. పవన్ కు ఒక్క సీటు రాదంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారని, వైసీపీ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లనే పవన్ టీడీపీకి దగ్గరవుతున్నట్లుందని టీజీ వెంకటేష్ అన్నారు. ఒక్క సీటు రాని పవన్, చంద్రబాబు కలిస్తే వైసీపీ నేతలు ఎందుకు కలవరపడుతున్నారని ఆయన ప్రశ్నించారు.
Next Story

