Thu Mar 19 2026 10:30:01 GMT+0530 (India Standard Time)
మా ఇద్దరి మధ్య గ్యాప్ ఉంది నిజమే
క్షేత్రస్థాయిలో బీజేపీ, జనసేన మధ్య కొంత గ్యాప్ ఉన్నది నిజమేనని బీజేపీ సీనియర్ నేత పురంద్రీశ్వరి అన్నారు.

క్షేత్రస్థాయిలో బీజేపీ, జనసేన మధ్య కొంత గ్యాప్ ఉన్నది నిజమేనని బీజేపీ సీనియర్ నేత పురంద్రీశ్వరి అన్నారు. అయితే పై స్థాయిలో ఎటవంటి గ్యాప్ లేదన్నారామె. బీజేపీ, జనసేన బంధం కొనసాగుతుందని ఆమె తెలిపారు. వచ్చే ఎన్నికల్లోనూ జనసేన, బీజేపీ కలసి పోటీ చేస్తుందని పురంద్రీశ్వరి తెలిపారు. ఇప్పటికే రెండు పార్టీలు పొత్తులో ఉన్నాయని ఆమె గుర్తు చేశారు.
ఉప ఎన్నికలో....
ఆత్మకూరు ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిని బరిలోకి దించేముందు జనసేనను సంప్రదించామని పురంద్రీశ్వరి తెలిపారు. జనసేన తమకు ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికలో మద్దతిస్తుందని ఆమె తెలిపారు. రెండు పార్టీలు కలసి పనిచేస్తాయని, క్షేత్రస్థాయిలో ఉన్న గ్యాప్ ను కూడా తొలగించేందుకు అగ్రనేతలు కృషి చేస్తారని ఆమె తెలిపారు.
Next Story

