Thu Mar 19 2026 10:05:45 GMT+0530 (India Standard Time)
బీజేపీకి కన్నా గుడ్‌బై..?
బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మార్పు పై నేడు క్లారిటీ రానుంది. ఈరోజు ఆయన ముఖ్య అనుచరులతో సమావేశమవుతున్నారు

బీజేపీ రాష్ట్ర మాజీ అధ్కక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మార్పు పై నేడు క్లారిటీ రానుంది. ఈరోజు ఆయన ముఖ్య అనుచరులతో సమావేశమవుతున్నారు. గుంటూరులోని తన నివాసంలో జరుగుతున్న ఈ సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలిసింది. ఈ నెల 23, 24వ తేదీల్లో పార్టీ మారేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నట్లు సన్నిహితుల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
జనసేనలోకి వెళ్లేందుకు...
కన్నా లక్ష్మీనారాయణ జనసేనలోకి వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. టీడీపీ నుంచి కూడా ఆహ్వానం ఉందంటున్నారు. జనసేన, టీడీపీ పొత్తు ఉన్న నేపథ్యంలో తన గెలుపుకు గుంటూరులో ఢోకాలేదని భావించిన కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. గత కొంతకాలంగా బీజేపీలో ఇమడలేకపోతున్న ఆయన ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని, త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారని చెబుతున్నారు.
Next Story

