Sun Mar 15 2026 07:58:11 GMT+0530 (India Standard Time)
ఈ పోలీసు వ్యవస్థ మారాల్సిందే
ప్రభుత్వం వచ్చిన మూడేళ్లలో రాష్ట్ర ఆదాయం తగ్గలేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తెలిపారు.

ప్రభుత్వం వచ్చిన మూడేళ్లలో రాష్ట్ర ఆదాయం తగ్గలేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తెలిపారు. ప్రభుత్వ సలహాదారులకే వందల కోట్లను ఈ ప్రభుత్వం దోచి పెడుతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను తగ్గించడమేంటని ఆయన ప్రశ్నించారు. దేశ చరిత్రలో ఎక్కడా ఇలా జరగలేదని సీఎం రమేష్ అన్నారు. తొలి మూడేళ్లలో ఆదాయం వచ్చినా ప్రభుత్వం మాత్రం కార్యాలయాలకు రంగులు వేయడానికి ఎక్కువ ఖర్చు చేసిందన్నారు.
సలహాదారులకు.....
ప్రభుత్వంలో సలహాదారులను ఎక్కువ సంఖ్యలో నియమించుకున్న వైసీపీ ప్రభుత్వ దానికే వందల కోట్ల ను ఖర్చు చేస్తుందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఉందని సీఎం రమేష్ అన్నారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా మారి విపక్ష నేతలపై అక్రమ కేసులను బనాయిస్తున్నారని ఆరోపించారు. రంగులు వేసి తీయడంతో వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఏపీలో పోలీసు వ్యవస్థ సరిగా లేదని అన్నారు. గుడివాడలో క్యాసినోపై పోలీసు అధికారులు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు.
Next Story

