Fri Mar 27 2026 15:10:44 GMT+0530 (India Standard Time)
ఏపీలో మతమార్పిడులు ఎక్కువే
ఆంధ్రప్రదేశ్ లో మతమార్పిడులు ఎక్కువగా జరుగుతున్నాయని బీజేపీ ఇన్ చార్జి సునీల్ దియోధర్ అన్నారు

ఆంధ్రప్రదేశ్ లో మతమార్పిడులు ఎక్కువగా జరుగుతున్నాయని బీజేపీ ఇన్ చార్జి సునీల్ దియోధర్ అన్నారు. మత మార్పిడులను ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందని అన్నారు. మతమార్పిడులను ప్రోత్సహిస్తూ ఎక్కువ మందిని ఆకట్టుకునే విధంగా ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎస్సీ రిజర్వేషన్లపైన పోటీ చేసి గెలుపొందిన ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని సునీల్ దియోధర్ డిమాండ్ చేశారు.
మతమార్పిడులకు వ్యతిరేకంగా....
వెంటనే హోంమంత్రి సుచరిత రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మతమార్పిడులకు వ్యతిరేకంగా బిల్లును తెస్తామని సునీల్ దియోధర్ చెప్పారు. ఆయన వాజపేయి కి నివాళలర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ఆలయాల ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయని చెప్పారు.
- Tags
- sunil diodhar
- bjp
Next Story

