Fri Mar 27 2026 06:37:02 GMT+0530 (India Standard Time)
నేడు బీజేపీ చలో అమలాపురం
కోటిపల్లి - నరసాపురం రైల్వే లైను కు సంబంధించి ప్రభుత్వం తమ వాటాను చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆందోళనకు దిగింది

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమవుతుంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లో ఉండాలని బీజేపీ భావిస్తుంది. ఇందుకోసం ప్రజా సమస్యలపై పోరాటాలకు కార్యాచరణను రూపొందించుకుంది.
రైల్వే లైను నిధుల వాటాను....
ఇందులో భాగంగా నేడు బీజేపీ చలో అమలాపురం కార్యక్రమానికి పిలుపు నిచ్చింది. కోటిపల్లి - నరసాపురం రైల్వే లైను కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాను చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చలో అమలాపురం కార్యక్రమానికి పిలుపు నిచ్చింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావులు పాల్గొంటారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశమున్నందున పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

