Mon Mar 16 2026 20:52:32 GMT+0530 (India Standard Time)
బీజేపీలో చేరిన వైసీపీ క్యాడర్
యువత వైసీపీని వీడి బీజేపీలో చేరడం మంచి పరిణామమని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు

దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవుతూ యువత వైసీపీని వీడి బీజేపీలో చేరడం మంచి పరిణామమని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు . విజయవాడ లంబాడీ పేట నుంచి వత, ముస్లిం మహిళలు బీజేపీలో చేరారు. మాజీ కార్పొరేటర్ తాజా నోత్ దాస్ కుమారుడు రవి నాయకత్వంలో బీజేపీలో చేరడం సంతోషం కలిగిస్తోందని సుజనా చౌదరి అన్నారు.మానవతా దృక్పథంతో ప్రజాసేవ చేయాలన్నది తన అభిమతమని సుజనా అన్నారు.
టీడీపీలో చేరడంతో...
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీని వీడి కొందరు నేతలు టీడీపీలో చేరారు.బొమ్మసాని సుబ్బారావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ కార్పొరేటర్ మంటి కోటేశ్వరరావు, ఏలూరి వెంకన్న, మధిర ప్రభాకర్ లకు కండువా కప్పి పార్టీలోకి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ ఆహ్వానించారు. ఇది సుజనా చౌదరికి మరింత బలం చేకూరుస్తుందని ఆయన వర్గం అభిప్రాయపడుతుంది.
Next Story

