Thu Jan 29 2026 04:10:22 GMT+0000 (Coordinated Universal Time)
పోలవరం ప్రాజెక్టు వద్ద పెద్దపులి సంచారం
పులి ఏ క్షణంలో ఏ వైపు నుండి దాడిచేస్తుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రాజెక్టు సమీపంలో పులి సంచరిస్తోన్న..

పోలవరం ప్రాజెక్టు వద్ద పెద్దపులి సంచారం స్థానికులను హడలెత్తిస్తోంది. పెద్దపులి సంచారంతో స్థానికులతో పాటు ప్రాజెక్టు అధికారులు, కార్మికులు భయంతో వణికిపోతున్నారు. పులి ఏ క్షణంలో ఏ వైపు నుండి దాడిచేస్తుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రాజెక్టు సమీపంలో పులి సంచరిస్తోన్న విషయాన్ని అటవీశాఖ అధికారులు సైతం ధృవీకరించారు. పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతంలో పులి తిరుగున్నట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. స్థానికులు, ప్రాజెక్ట్ అధికారులు, కార్మికులు రాత్రివేళల్లో జాగ్రత్తగా ఉండాలని, ఎవరూ బయట తిరగరాదని హెచ్చరించారు. రాత్రి వేళల్లో ప్రాజెక్టు ప్రాంతంలో పులి సంచరిస్తోన్న దృశ్యాలను అక్కడున్న సిబ్బంది తమఫోన్లలో చిత్రీకరించారు.
10 రోజుల క్రితం ప్రకాశం జిల్లా కంభం ప్రాంతంలోనూ పులి సంచారం కలకలం రేపింది. నాగులవరం - మొహిద్దీన్ పురం ల మధ్య పులి సంచరిస్తుండాన్ని అధికారులు గుర్తించారు. కంభం చెరువులోకి నీరు తాగేందుకు పులి వెళుతుండగా స్థానికులు చూసి అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అటవీ శాఖ అధికారులు పులి పాదముద్రలను సేకరించారు. ఒంటరిగా ఇటు వైపు ఎవరూ రావద్దని, రాత్రి వేళ అసలు రావద్దని అటవీ శాఖ అధికారులు సమీప గ్రామ ప్రాంత ప్రజలకు ఆదేశాలు జారీ చేశారు.
Next Story

