Thu Mar 19 2026 03:01:32 GMT+0530 (India Standard Time)
వారికి భువనేశ్వరి భరోసా
అమరావతి రైతులకు భువనేశ్వరి భరోసా ఇచ్చారు. రైతులు చేసిన త్యాగాలు వృధా కాబోవని ఆమె తెలిపారు

అమరావతి రైతులకు భువనేశ్వరి భరోసా ఇచ్చారు. రైతులు చేసిన త్యాగాలు వృధా కాబోవని ఆమె తెలిపారు. రాజమండ్రిలో ఉన్న నారా భువనేశ్వరిని కలిసిన అమరావతి రైతులు సంఘీభావం ప్రకటించారు. అమరావతి నిర్మాణం జరిగి తీరుతుందని ఆమె ఈ సందర్భంగా రైతులతో వ్యాఖ్యానించారు. అధైర్యపడవద్దని, వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ ప్రభుత్వం అమరావతి నిర్మాణంపై దృష్టి పెడుతుందని ఆమె హామీ ఇచ్చారు.
కష్టకాలంలో...
అయితే అందరూ వచ్చే ఎన్నికల్లో కలసి ఐక్యంగా ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. తమ కుటుంబం కష్ట సమయంలో ఉన్నప్పుడు ప్రజల నుంచి వస్తున్న మద్దతును మరిచిపోలేనన్న భువనేశ్వరి ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆయన త్వరలోనే కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అమరావతి రైతులతో భువనేశ్వరి అన్నారు.
Next Story

