Sun Dec 08 2024 00:16:16 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో భూమన ప్రమాణం
తిరుమలలో భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు. తన హయాంలో ఎలాంటి అవినీతి జరగలేదని తెలిపారు
తిరుమలలో భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు. తాను కానీ తప్పు చేసి ఉంటే తాను, తన కుటుంబం సర్వనాశనం చేసిపోతామని ఆయన తనను శపించుకున్నారు. తిరుమలకు వచ్చిన భూమన కరుణాకర్ రెడ్డి అక్కడ కోనేటి వద్ద స్నానం చేశారు. అనంతరం ఆయన తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయం అఖిలాండ వద్దకు వచ్చి ఆయన ప్రమాణం చేశారు.
పోలీసులు అడ్డుకుని...
అంతకు ముందు తిరుమలకు వస్తున్న భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకుని ఆయన చేత సంతకం చేయించుకున్నారు. తాను తిరుమల కొండపై రాజకీయం మాట్లాడబోనని తెలిపారు. అయితే తిరుమలకు వచ్చిన భూమన మాత్రం అఖిలాండ వద్ద దీపం వెలిగించి తన హయాంలో నెయ్యి కల్తీ జరగలేదని, తప్పుచేసి ఉంటే సర్వనాశనం అయిపోతామని ఆయన అన్నారు. ఇది కావాలని జరుగుతున్న కుట్ర అంటూ ఆయన మండిపడ్డారు.
Next Story