Sun Mar 15 2026 14:04:29 GMT+0530 (India Standard Time)
ఆమె మద్దూరు అఖిలప్రియ.. భూమా కాదు
భూమా కిషోర్ రెడ్డి తాను ప్రచారాన్ని ప్రారంభిస్తానని చెప్పారు. వచ్చే నెల ఏడో తేదీ నుంచి ప్రచారం నిర్వహిస్తానన్నారు

భూమా కిషోర్ రెడ్డి తాను ప్రచారాన్ని ప్రారంభిస్తానని చెప్పారు. ఆళ్లగడ్డలో వచ్చే నెల ఏడు లేదా తొమ్మిదో తేదీ నుంచి ప్రచారం నిర్వహిస్తానని తెలిపారు. తానే ఈసారి ఎన్నికల్లో భూమా కుటుంబం నుంచి పోటీ చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. తాను బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉంటానని చెప్పారు. మాజీ మంత్రి అఖిలప్రియ ఇంటి పేరు భూమా కాదని, ఆమె మద్దూరు అఖిలప్రియ అంటూ ఆయన అన్నారు. అఖిలప్రియ భూమా కుటుంబానికి చెందిన వ్యక్తి కాదని ఆయన అన్నారు.
తానే పోటీ చేస్తానంటూ...
భూమా కుటుంబ వారసత్వం తనకే ఉందని ఆయన తెలిపారు. భూమా అనుచరుల మద్దతు కూడా తనకే ఉందని చెప్పిన కిషోర్ రెడ్డి ఈసారి బీజేపీ టిక్కెట్ తనదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను ప్రచారం నిర్వహిస్తానని, ప్రజల్లోనే ఉండి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తానని భూమా కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. భూమా అఖిలప్రియకు గాని, ఆమె భర్తకు గాని ఆళ్లగడ్డతో సంబంధం లేదని ఆయన అన్నారు. ఆళ్లగడ్డలో ఈ కామెంట్స్ భూమా కుటుంబంలో చిచ్చురేపినట్లయింది.
Next Story

