Thu Mar 19 2026 06:28:37 GMT+0530 (India Standard Time)
Srisailam : భక్తులకు అలెర్ట్ 7న శ్రీశైలం ఆలయం మూసివేత
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయాన్ని ఈ నెల 7వ తేదీ మూసివేయనున్నారు.

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయాన్ని ఈ నెల 7వ తేదీ మూసివేయనున్నారు. ఈనెల 7వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఎనిమిదో తేదీ ఉదయం 5 గంటల వరకు మూసివేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా 7 వ తేది న స్వామి స్పర్శ దర్శనం పూర్తిగా నిలుపుదల చేసినట్టు ఆయన తెలిపారు. ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలు, పరోక్ష సేవలు, ఆదిదంపతుల కళ్యాణోత్సవం పూర్తిగా నిలిపివేశారు. ఆరోజున అలంకార దర్శనం మాత్రమే భక్తులందరికీ అవకాశం ఉంటుందని తెలిపారు. సాక్షి గణపతి, హఠ కేశ్వరం, పాల ధార, పంచదార, శిఖ రేశ్వరం, తదితర పరివారా ఆలయ ద్వారాలను కూడా మూసివేస్తారు.
సెప్టెంబర్ 8 న ఉదయం...
సెప్టెంబర్ 8 న ఉదయం ఐదు గంటలకు ఆలయ ద్వారాలను తెరిచి, ఆలయ శుద్ధి సంప్రోక్షణ జరిపించిన తర్వాత ప్రాతః కాలం పూజలు ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 7:30 గంటల నుంచి శ్రీ స్వామి అమ్మవార్ల కు మంగళ హారతులు జరిపిస్తారు. మంగళ హారతుల సమయం నుంచి అనగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2.15 గంటల వరకు స్వామి అలంకార దర్శనం కల్పిస్తారు. సెప్టెంబర్ 8 వ తేదీ నాటికి ఆన్ లైన్ లో స్వామి స్పర్శ దర్శనం, , విరామ దర్శనం టికెట్లు పొందిన భక్తులకు మధ్యాహ్నం 2.15 గంటల నుంచి 4 గంటల వరకు శ్రీ స్వామి స్పర్శ దర్శనం కల్పిస్తారు. తిరిగి సాయంకాలం ఐదున్నర గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అలంకార దర్శనాలు కొనసాగుతాయి.
Next Story

