Mon Mar 16 2026 18:34:53 GMT+0530 (India Standard Time)
ఇంద్రకీలాద్రికి పోటెత్తుతున్న భవానీలు
నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ కార్యక్రమం జరుగుతుంది.

నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ కార్యక్రమం జరుగుతుంది. భవానీలు అధిక సంఖ్యలో వస్తుండటంతో ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతుంది. భవానీ దీక్షల విరమణ కావడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భవానీలు విజయవాడకు ఇప్పటికే చేరుకున్నారు.

ఆర్జిత సేవల రద్దు...
దీంతో ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి ఐదు రోజులపాటు ఉచిత దర్శనాలు ఉంటాయని ప్రకటించారు. ప్రత్యేకించి భవానీలు కనకదుర్గమ్మను త్వరగా దర్శించుకునేలా ఏర్పాట్లు చేసింది. రోజుకు లక్ష మంది ఇంద్రకీలాద్రికి వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి నుంచి దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు రద్దు చేశారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

