Fri Mar 27 2026 13:23:36 GMT+0530 (India Standard Time)
నాకు అల్లుడితో సంబంధం లేదు
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తన అల్లుడిపై కేసు నమోదయిన విషయంపై స్పందించారు.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తన అల్లుడిపై కేసు నమోదయిన విషయంపై స్పందించారు. తనకు అల్లుడితో ఎటువంటి సంబంధాలు లేవని చెప్పారు. సోము వీర్రాజు అల్లుడిపై పోలీసులు చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ తనకు ముగ్గురు అమ్మాయిలున్నారని, కాని అల్లుళ్లు ఇద్దరేనని అన్నారు.
కేరెక్టర్ నచ్చలేదు...
తన కూతుళ్లకు తాను పెళ్లి చేయలేదని, కన్యాదానం చేయలేదని సోము వీర్రాజు చెప్పాయి. మా అమ్యాయి పెళ్లి చేసుకుని వెళ్లిందన్నారు. తన అల్లుడి కేరెక్టర్ తనకు నచ్చలేదని, అందుకే ఆయనను తన అల్లుడిగా అంగీకరించలేదని చెప్పారు. గతంలో ఆయనపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళితే వారు స్వీకరించలేదన్నారు. ఆయనతో తనకు ఎటువంటి సంబంధం లేదని, అతని ప్రస్తావన తేవద్దని సోము వీర్రాజు సూచించారు.
- Tags
- somu veerraju
- bjp
Next Story

