Sat Dec 06 2025 16:30:37 GMT+0000 (Coordinated Universal Time)
బాబుకు, జగన్ కు ఏమీ తేడా లేదు... ఇద్దరూ స్టిక్కర్ల సీఎంలే
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు తన పేరు పెట్టుకున్నారని ఆరోపించారు. గతంలో చంద్రబాబు కూడా స్టిక్కర్ బాబుగా పేరు తెచ్చుకున్నారని, ఇప్పుడు జగన్ కూడా అదే మాదిరి కేంద్ర పథకాలకు తన పేరు పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో అమలవుతున్న ప్రధానమంత్రి ఆవాజ్ పథకానికి జగన్ పేరు పెట్టుకోవడమేంటని సోము వీర్రాజు నిలదీశారు.
36 పథకాలకు....
ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న 36 కేంద్ర ప్రభుత్వ పథకాలకు జగన్ పేరు పెట్టుకున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. వీటిని వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే కొన్ని శాఖలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాయని కూడా సోము వీర్రాజు తెలిపారు.
Next Story

