Fri Dec 05 2025 21:17:28 GMT+0000 (Coordinated Universal Time)
ఇదొక చెత్త ప్రభుత్వం.. జీవీఎల్ ఫైర్
వైసీపీ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు

వైసీపీ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్ను చెల్లించకుంటే చెత్తను వారి ఇంటి ముందు వేయమని వైసీపీ నేతలు వ్యాఖ్యానించడాన్ని జీవీఎల్ తప్పుపట్టారు. వైసీపీ ప్రభుత్వంలో పన్నులు తప్ప అభివృద్ధి లేదని జీవీఎల్ నరసింహారావు అభిప్రుాయపడ్డారు. ప్రజలను వైసీపీ మంత్రులు భయపెడుతున్నారన్నారు.
ఇచ్చిన నిధులను కూడా....
3,180 కోట్లను జగజ్జీవన్ రామ్ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే వైసీపీ ప్రభుత్వం ఇంతవరకూ వాడుకోలేకపోతునందని జీవీఎల్ నరసింహారావు ధ్వజమెత్తారు. విశాఖలో వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం పూర్తయి ఆరేళ్లవుతున్నా ఇంతవరకూ ఎందుకు ప్రారంభించలేదని జీవీఎల్ ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి కక్ష సాధింపులు తప్ప మరేవీ పట్టవని ఆయన వ్యాఖ్యానించారు.
Next Story

