Sat Apr 04 2026 10:43:08 GMT+0530 (India Standard Time)
జగన్ కు సోము వీర్రాజు ఘాటు లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. ఏకగ్రీవ పంచాయతీలకు ఇస్తామన్న ప్రోత్సాహకాలు ఏవని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు పంచాయతీలు ఏకగ్రీవమయితే పంచాయతీ స్థాయిని బట్టి ప్రభుత్వం ఐదు లక్షల నుంచి ఇరవై లక్షలు ప్రోత్సాహకాలను ఇస్తామని ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. ఇందుకోసం ఉత్తర్వులు కూడా విడుదల చేశారన్నారు.
ఏకగ్రీవమయినా...
ప్రోత్సహకాలను చూసి ఆంధ్రప్రదేశ్ లో 2,199 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయని, జగన్ ప్రభుత్వం చెప్పినట్లు వాటికి ప్రోత్సహాకాలు ఇంతవరకూ విడుదల చేయలేదని సోము వీర్రాజు తన లేఖలో పేర్కొన్నారు. అంటే ప్రభుత్వ ఉత్తర్వులు ఉత్తుత్తివేనా? అని ఆయన ఎద్దేవా చేశారు. వెంటనే ఏకగ్రీవమయిన పంచాయతీలకు ప్రోత్సహకాలు విడుదల చేయాలని సోము వీర్రాజు తన లేఖలో డిమాండ్ చేశారు.
Next Story

