Fri Apr 03 2026 22:19:43 GMT+0530 (India Standard Time)
జగన్ పై సోము ఫైర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను జగన్ ప్రభుత్వం సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటుందని సోము వీర్రాజు అన్నారు. ఏపీలో అరాచక రాజ్యం నడుస్తుందని సోము వీర్రాజు అన్నారు. అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయ్యాయని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు.
అన్ని వర్గాల వారిని....
అన్ని వర్గాల ప్రజలను జగన్ అడ్డగోలుగా దోచుకుంటున్నారని సోము వీర్రాజు అన్నారు. సినిమా టిక్కట్ల ధరలపై ప్రభుత్వం పునరాలోచించాలని సోము కోరారు. త్వరలో భారతీయ జనతా పార్టీ మండల స్థాయిలో సమావేశాలను ఏర్పాటు చేసి పార్టీని మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు.
Next Story

