Thu Dec 18 2025 07:34:52 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబుపై మా వైఖరిలో మార్పు లేదు
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రజాదరణ ఎక్కువని అన్నారు.

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రజాదరణ ఎక్కువని అన్నారు. ప్రజాదరణ ఎక్కువ ఉన్న చోట జూనియర్ ఎన్టీఆర్ సేవలను ఉపయోగించుకుంటామని తెలిపారు. జనసేన తో మా పొత్తు కొనసాగుతుందని చెప్పారు. చంద్రబాబు పై తన వైఖరిలో ఎటువంటి మార్పు లేదని సోము వీర్రాజు తెలిపారు. కుటుంబ పార్టీలకు తాము దూరమని పార్టీ అధినాయకత్వమే చెప్పిందని ఆయన గుర్తు చేశారు.
జూనియర్ సేవలను ...
రాజకీయాలు కొంతమందే చేయరని, అందరూ చేస్తారని సోము వీర్రాజు అన్నారు. మా పార్టీలోనే కాదని, అన్ని పార్టీల్లో యాక్టర్లు ఉన్నారన్నారు. అందరూ సినిమా యాక్టర్లే. యాక్టర్లు కాని వారు ఎవరు అని ఆయన ఎద్దేవా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కు ఎక్కువ మంది ఆంధ్రాలో వస్తారా? తెలంగాణలో వస్తారా? అని సోము వీర్రాజు ప్రశ్నించారు. రెండు ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడ ఎక్కువ జూనియర్ ఎన్టీఆర్ కు ప్రజాదరణ ఉంటే అక్కడ ఉపయోగించుకుంటామని తెలిపారు.
Next Story

