Sat Mar 07 2026 21:57:12 GMT+0530 (India Standard Time)
నడ్డాను కలిసిన మాజీ ఎంపీ
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను మాజీ పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత భేటీ అయ్యారు

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను మాజీ పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత భేటీ అయ్యారు. బీజేపీలో చేరేందుకు ఆమె ఆసక్తిని కనపరుస్తున్నారు. నోవాటెల్ హోటల్ లో తన భర్తతో వచ్చిన గీత జేపీ నడ్డాను కలసి కాసేపు చర్చించారు. 2014లో వైసీపీ ఎంపీగా విజయం సాధించిన గీత ఆ తర్వాత ఆ పార్టీకి దూరమయ్యారు. తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అనంతరం టీడీపీకి కూడా దూరమయ్యారు.
రాజకీయాలకు దూరంగా....
గత కొంత కాలం నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న గీత ఒక్కసారిగా జేపీ నడ్డాను కలవడంతో రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఆమె బీజేపీలో చేరతారన్న ప్రచారం జరుగుతుంది. రాజ్యసభ సభ్యలు కె లక్ష్మణ్ ఆమె కుటుంబాన్ని జేపీ నడ్డాకు పరిచయం చేశారు. అయితే పార్టీలో ఎప్పుడు చేరేదీ స్పష్టంకాకపోయినప్పటికీ చేరడం మాత్రం ఖాయంగా తెలుస్తోంది. కొత్తపల్లి గీత భూవివాదాల్లో చిక్కుకున్నారు. ఎప్పుడు బీజేపీలో చేరేది త్వరలోనే ఆమె ప్రకటించే అవకాశాలున్నాయి.
Next Story

