Sun Mar 15 2026 05:36:00 GMT+0530 (India Standard Time)
BJP : ఏపీలో బీజేపీ పోటీ చేసే స్థానాలు ఇవే నట
ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసే స్థానాలపై భారతీయ జనతా పార్టీ నేతలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసే స్థానాలపై భారతీయ జనతా పార్టీ నేతలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడిన తర్వాత పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ పది అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ, ఆరు పార్లమెంటు స్థానాల్లోనూ పోటీ చేయాలని నిర్ణయించింది. అయితే ఏ ఏ స్థానాల్లో పోటీ చేయాలన్న దానిపై ఇప్పటి వరకూ ప్రకటించలేదు. అయితే పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు బీజేపీ పోటీ చేయాల్సిన స్థానాలను ఇప్పటికే ఖరారయినట్లు తెలిసింది.
ఈ నియోజకవర్గాల్లో...
విశాఖ నార్త్ నియోజకవర్గం, శ్రీకాకుళం, పాడేరు, అనపర్తి, కైకలూరు, విజయవాడ వెస్ట్, బద్వేలు, జమ్మలమడుగు, ధర్మవరం, ఆదోని నియోజకవర్గాల్లో పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ స్థానాలకు అభ్యర్థుల పేర్లను కూడా నేడు, రేపట్లో బీజేపీ ప్రకటించే అవకాశముంది. ఈ స్థానాల్లోనే తాము బలంగా ఉన్నామని బీజేపీ భావిస్తుంది. ఇక పార్లమెంటు స్థానాలకు వచ్చేసరికి అనకాపల్లి, ఏలూరు, రాజమండ్రి, రాజంపేట, తిరుపతి, హిందూపురంలలో పోటీ చేయాలని భావిస్తుంది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
Next Story

