Fri Mar 27 2026 16:57:11 GMT+0530 (India Standard Time)
ఏపీ బీజేపీలో నేటి నుంచి?
ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ బలోపేతం అయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది

ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ బలోపేతం అయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈరోజు నుంచి పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ముఖ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వనున్నారు. పార్టీ సిద్ధాంతాలతో పాటు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజాప్రయోజనకర విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వారికి అవగాహన కల్పించనున్నారు.
శిక్షణ కార్యక్రమాలు....
ఈరోజు నుంచి ఈ నెల 26వ తేదీ వరకూ ఈ శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ లో బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
Next Story

