Sun Jan 12 2025 21:02:09 GMT+0000 (Coordinated Universal Time)
ఆత్మకూరు బీజేపీ అభ్యర్థి ఈయనే... నేడే నామినేషన్
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఉప ఎన్నిక అభ్యర్థిని భారతీయ జనతా పార్టీ ఖరారు చేసింది
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఉప ఎన్నిక అభ్యర్థిని భారతీయ జనతా పార్టీ ఖరారు చేసింది. బీసీ వర్గానికి చెందిన భరత్ కుమార్ ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరు నియోజకవర్గం ఉప ఎన్నిక అనివార్యమయింది. అయితే టీడీపీ, జనసేన పార్టీలు పోటీకి దూరంగా ఉన్నాయి. మేకపాటి కుటుంబంలోనే టిక్కెట్ ఇవ్వడంతో ఈ రెండు ప్రధాన పార్టీలు పోటీకి దూరంగా ఉన్నాయి. కానీ బీజేపీ మాత్రం బద్వేలు తరహాలోనే ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీ చేయాలని నిర్ణయించింది.
వివిధ పదవులు...
ఆత్మకూరు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా భరత్ కుమార్ ను పార్టీ ప్రకటించింది. భరత్ కుమార్ ప్రస్తుతం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గతంలో బీజేవైఎం కార్యదర్శిగా కూడా పనిచేశారు. జిల్లా ఉపాధ్యక్షుడిగా కూడా బాధ్యతలను నిర్వహించారు. కావలి పట్టణ అధ్యక్షుడిగా పనిచేశారు. భరత్ కుమార్ బీసీ వర్గానికి చెందిన వారని, అసలైన సామాజిక న్యాయం బీజేపీ ద్వారానే సాధ్యమవుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. నేడు భరత్ కుమార్ ఆత్మకూరు నియోజవర్గం ఉప ఎన్నికలో నామినేషన్ వేశారు. నెల్లూరుకు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేరుకున్నారు.
Next Story