Sun Feb 01 2026 05:36:38 GMT+0000 (Coordinated Universal Time)
పవన్, బాబు భేటీపై బీజేపీ హైకమాండ్ ఏమందంటే?
పవన్ కల్యాణ్, చంద్రబాబుల భేటీని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తేలిగ్గా కొట్టిపారేసింది

పవన్ కల్యాణ్, చంద్రబాబుల భేటీని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తేలిగ్గా కొట్టిపారేసింది. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో హైకమాండ్ ఫోన్ లో మాట్లాడినట్లు తెలిసింది. రాజకీయ పార్టీలన్న తర్వాత ఒకరినొకరు కలవడం మామూలేనని వారు చెప్పినట్లు తెలిసింది. ఒక సంఘటన జరిగిన తర్వాత సంఘీభావం, సానుభూతిని ప్రకటించడానికి వస్తే తప్పు లేదని, దానిని భూతద్దంలో చూడాల్సిన పనిలేదని హైకమాండ్ అభిప్రాయపడుతుంది.
జనసేనతోనే...
ఇప్పటి వరకూ అయితే జనసేనతోనే కలసి వెళ్లాలని రాష్ట్ర బీజేపీకి సూచించినట్లు సమాచారం. జనసేనతోనే వచ్చే ఎన్నికలకు వెళ్లాలన్నది ఇప్పటికీ తమకున్న ఏకైక అభిప్రాయమని తెలియజెప్పినట్లు చెబుతున్నారు. ప్రధాని మోదీని, చంద్రబాబు కలిసిన విషయం కూడా ఈ విషయం కొందరు గుర్తు చేస్తున్నారు. రాజకీయ పార్టీ అధినేతలను ఎవరో ఒకరు కలుస్తుంటారని, వాటికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పినట్లు తెలిసింది.
Next Story

