Sat Jan 31 2026 21:48:52 GMT+0000 (Coordinated Universal Time)
BJP : ఆరుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. ఆరు పార్లమెంటు స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించింది.

భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. ఆరు పార్లమెంటు స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించింది. కొత్తగా చేరిన వారికి రెండు సీట్లు ప్రకటించగా, పాత వారికి కొందరికి సీట్లు కేటాయించలేదు. పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఆరు పార్లమెంటు స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది. నరసాపురం టిక్కెట్ ను శ్రీనివాసవర్మ, తిరుపతి నుంచి వరప్రసాద్, రాజంపేట నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రకటించింది.
కొందరు నేతలకు మాత్రం...
రాజమండ్రి నుంచి పురంద్రీశ్వరి, అరకు నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేష్ లకు స్థానం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. సుజనా చౌదరి లాంటి నేతలను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. సోము వీర్రాజుకు కూడా టిక్కెట్ దక్కలేదు. దీంతో వారికి అసెంబ్లీ స్థానాల్లో అవకాశం కల్పిస్తారని అంటున్నారు.
Next Story

