Fri Mar 27 2026 10:09:45 GMT+0530 (India Standard Time)
ఈరోజు బీజేపీ చలో గుడివాడ
ఈరోజు మధ్యాహ్నం బీజేపీ నేతలు గుడివాడ బయలు దేరి వెళ్లనున్నారు.

గుడివాడలో జరిగిన క్యాసినో వ్యవహారం ఇంకా మరుగున పడలేదు. ఈరోజు మధ్యాహ్నం బీజేపీ నేతలు గుడివాడ బయలు దేరి వెళ్లనున్నారు. మంత్రి కొడాలి నాని కె కన్వెన్షన్ సెంటర్ లో క్యాసినో నిర్వహించినట్లు ఆరోపణలున్నాయి. సంక్రాంతి మూడు రోజులు ఈ క్యాసినో నిర్వహించారని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పటికే టీడీపీ నిజనిర్ధారణ కమిటీ పేరుతో గుడివాడ పర్యటనకు వెళ్లింది.
క్యాసినో.....
అయితే వైసీపీ నేతలు టీడీపీ నిజనిర్ధారణ కమిటీని అడ్డుకున్నారు. కానీ ఈరోజు బీజేపీ నేతలు గుడివాడ వెళ్లి క్యాసినో ఆరోపణలపై నిజాలను తెలుసుకోనున్నారు. గుడివాడలో సంక్రాంతి ముగింపు సంబరాలను తాము నిర్వహిస్తామని సోము వీర్రాజు తెలిపారు. ధర్మం అంటే గడ్డాలు పెంచుకోవడం కాదని, సంస్కృతి అంటే ఏంటో తాము చూపిస్తామని సోము వీర్రాజు అన్నారు. మధ్యాహ్నం సోమువీర్రాజుతో సహా బీజేపీ నేతలు గుడివాడ పర్యటనకు వెళుతున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశముంది.
- Tags
- bjp
- somuveeraju
Next Story

