Fri Dec 05 2025 22:19:04 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో మంత్రుల అన్యమత ప్రార్థనలు
తిరుమలలో భారతీయ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు

తిరుమలలో భారతీయ జనత పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు. తిరుమలలో కొందరు మంత్రులు అన్యమత ప్రార్థనలు చేశారని ఆయన ఆరోపించారు. ఆయన ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. స్వామి వారి సన్నిధిలో అన్యమత ప్రచారం, ప్రార్థనలను జరపకూడదని తెలిపారు.
ప్రజలంతా....
తాను తిరుమల శ్రీవారిని దర్శించుకుని రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నానని తెలిపారు. కరోనా లాంటి విపత్తు నుండిచ దేశ ప్రజలను కాపాడి ఆయురారోగ్యలను ప్రసాదించిన కలియుగ దైవం వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నానని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంతోషాలను చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థించానని సోము వీర్రాజు తెలిపారు.
Next Story

