Thu Mar 19 2026 15:04:04 GMT+0530 (India Standard Time)
Breaking : రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్
భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మరో రెండు పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు

భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మరో రెండు పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ పేరును ఆయన ప్రకటించారు. వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా కడియం కావ్య పేరును ఖరారు చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
పోటీ చేయనని చెప్పడంతో...
ముదిరాజ్ లకు గత ఎన్నికల్లో ఒక్కస్థానం ఇవ్వలేదన్న విమర్శల నుంచి ఈ ఎంపికతో బీఆర్ఎస్ బయటపడే ప్రయత్నం చేసింది. అందుకే గత ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ లో చేరిన కాసాని జ్ఞానేశ్వర్ పేరును చేవెళ్లకు ఖరారు చేశారు. అక్కడ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి తాను మళ్లీ పోటీ చేయనని చెప్పడంతో కాసాని పేరును ఖరారు చేశారు. మరో వైపు వరంగల్ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య పేరును ఖరారు చేశారు.
Next Story

