Thu Mar 19 2026 23:23:30 GMT+0530 (India Standard Time)
ఏపీలో బీఆర్ఎస్ బ్యానర్లు
భారత రాష్ట్ర సమితి బ్యానర్లు ఆంధ్రప్రదేశ్ లో కన్పించాయి. విజయవాడలోనూ, అమలాపురంలోనూ ఈ బ్యానర్లు కొందరు ఏర్పాటు చేశారు

భారత రాష్ట్ర సమితి పార్టీ బ్యానర్లు ఆంధ్రప్రదేశ్ లో కన్పించాయి. విజయవాడలోనూ, అమలాపురంలోనూ ఈ బ్యానర్లు కొందరు ఏర్పాటు చేశారు. వియవాడలో బండి రమేష్ అనే వ్యక్తి ఈ బ్యానర్లు ఏర్పాటు చేయగా, అమలాపురంలో అమ్మాజీ పేరిట భరత రాష్ట్ర సమితి బ్యానర్లు వెలిశాయి.
కోనసీమలోనూ...
వచ్చే జనవరి నెలలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో బహిరంగసభ ఏర్పాటు చేయనున్నారని చెబుతున్నారు. బీఆర్ఎస్ కు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ లో బ్యానర్లు వెలియడంపై చర్చ జరుగుతోంది. అమలాపురంలో ఏర్పాటు చేసిన బ్యానర్లు అమ్మాజీ పేరుతో వెలియడంతో కోనసీమలో కలకలం రేగింది.
Next Story

