Mon Jan 26 2026 06:16:17 GMT+0000 (Coordinated Universal Time)
బెంగాల్ టైగర్ సంచారం కలకలం
ఆంధ్రప్రదేశ్ లో బెంగాల్ టైగర్ సంచారం కలకలం రేపుతుంది

ఆంధ్రప్రదేశ్ లో బెంగాల్ టైగర్ సంచారం కలకలం రేపుతుంది. బోను వచ్చినా.. డ్రోన్ లతో కూడా బెంగాల్ టైగర్ ను బంధించలేకపోతున్నారు అటవీ శాఖ అధికారులు. సోమవారం కూడా దీని జాడల ఆచూకీ కోసం షరా మామూలు అన్నట్టుగా అటవీ సిబ్బంది వెతుకులాట షురూ చేశారు. ఆదివారం మకాం చేసిన అదే డిప్పకాయల పాడు పరిసరాల్లో తిరిగినట్లు చెబుతున్నారు.జనం అయితే ఒకింత ఆందోళనలో ఉన్నారు.. అయితే దాన్ని చూసేందుకు కూడా మరికొందరు అత్యుత్సాహం చూపుతుండడం విశేషం..
క్రాసింగ్ టైమ్ కావడంతో...
ఆదివారం రాత్రి ఎక్కడా మరే మూగ జీవాన్ని బెంగాల్ టైగర్ చంపలేదు. అయితే బెంగాల్ టైగర్ సర్వసాధారణంగా మనుషులు జోలికి రాదంటున్నారు. కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ, ఓపిక పడితే కొంచెం అటుఇటుగా వచ్చిన మార్గాన్నే అటుఇటుగా ఎంచుకొని అడవిలోకి వెళ్తుందని అంటున్నారు. బోను పెట్టినా సరే అందులోకి ఇది వెళ్ళదని చెబుతున్నారు. ఎందుకంటే ఇది చిరుత మాదిరి అంత మందబుద్ధిది కాదపి.బెంగాల్ టైగర్ అనేది... మృగరాజు సింహం మాదిరి తెలివైనది అంటున్నారు . జనవరి, ఫిబ్రవరి నెలలు వీటికి క్రాసింగ్ సమయాలు కావడంతో అందుకే ఒక్కోసారి దారి తప్పడం.. అందునా క్షీణిస్తున్న అడవులు దృష్ట్యా ఇలా బాహ్య ప్రపంచానికి వచ్చి జనారణ్యంలో హల్ చల్ చేయడం రివాజు గా ఉంది.
Next Story

