Thu Mar 19 2026 13:09:45 GMT+0530 (India Standard Time)
High Court : ఎన్నికల కమిషన్ ఆదేశాలపై హైకోర్టుకు
ఎన్నికల కమిషన్ ఆదేశాలపై లబ్దిదారులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు

ఎన్నికల కమిషన్ ఆదేశాలపై లబ్దిదారులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. కొనసాగుతున్న పథకాలను నిలుపుదలచేయాలంటూ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై మహిళ లబ్దిదారులు హైకోర్టులో పిటీషన్ వేశారు. తమకు ఎప్పటి నుంచో వస్తున్న పథకాలను అందకుండా నిలిపివేయడం ఏంటని పిటీషన్ లో ప్రశ్నించారు.
తెలంగాణలో మాత్రం...
పొరుగున ఉన్న తెలంగాణలో ఆన్ గోయింగ్ పథకాలకు ఓకే చెప్పిన ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం తమను ఇబ్బంది పెట్టడానికే ఎన్నికల కమిషన్ నిలుపుదల చేయించిందని పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ పిటీషన్ ను హైకోర్టు స్వీకరించింది. దీనిపై మధ్యాహ్నం తర్వాత విచారణ చేపడతామని తెలిపింది.
Next Story

