Fri Dec 05 2025 17:50:38 GMT+0000 (Coordinated Universal Time)
బెండపూడి విద్యార్థుల ప్రతిభ.. సోషల్ మీడియా నుండి సీఎం దాకా
కాకినాడ జిల్లా బెండపూడి ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి

కాకినాడ జిల్లా బెండపూడి ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి. అమెరికన్ యాక్సెంట్ లో ఆ చిన్నారులు మాట్లాడే తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ రోజు ఆ స్కూలు విద్యార్థులు కొందరు సీఎం జగన్ ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. వారు సీఎం ఎదుట ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాదారు. వారు ఎలాంటి తడబాటు లేకుండా సీఎం జగన్ తో ఇంగ్లీషులో మాట్లాడారు. అమ్మ ఒడి, ఆంగ్ల మాధ్యమంలో బోధన, నాడు-నేడు పథకాల విశిష్టతను వారు ఇంగ్లీషులో వివరించారు. ఆ చిన్నారులు ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి జగన్ నవ్వుతూ కనిపించారు. వారి ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని వైఎస్ జగన్ మనస్ఫూర్తిగా అభినందించారు
బెండపూడి ప్రభుత్వ పాఠశాల విద్యార్దుల టాలెంట్ చూసి ఆ విద్యార్దులను ప్రత్యేకంగా అభినందించేకు ఆహ్వానించారు. ఐదుగురు విద్యార్థులతో పాటు వారికి ఇంగ్లీష్ నేర్పిస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయుడు ప్రసాద్‌ను సీఎం అభినందించారు. ఈ సందర్భంగా వాళ్లతో ముఖ్యమంత్రి సంభాషణ దాదాపుగా ఇంగ్లిష్‌లోనే కొనసాగింది. ఐదుగురు విద్యార్థుల్లో అనుదీప్ ముఖ్యమంత్రి జగన్‌తో సరదాగా మాట్లాడాడు. ఐఏఎస్ కావాలన్నది తన కలగా చెప్పిన అనుదీప్.. తాను ఐఏఎస్ అయ్యే వరకు ముఖ్యమంత్రి సీట్లో 'మీరే' (జగన్) ఉండాలన్నారు. తాను ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత సీఎం జగన్‌కు పీఎస్‌ను చేస్తే.. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం వద్దని విమర్శిస్తున్నవాళ్లందరి నోళ్లు మూయిస్తానని.. విమర్శకుల మాటలను పట్టించుకోవద్దని.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ను కొనసాగించమని అనుదీప్ కోరాడు. అనుదీప్ మాటలతో ముఖ్యమంత్రితో జగన్‌తో పాటు అక్కడున్నవాళ్లంతా పగలబడి నవ్వారు. మేఘన అనే విద్యార్థిని తన కిడ్డీ బ్యాంక్‌లోని రూ. 929 ముఖ్యమంత్రికి జగన్‌కు ఇచ్చింది. అయితే మేఘన నుంచి కేవలం రూ.19 మాత్రమే తీసుకుని మిగతా డబ్బును ఆమెకే తిరిగి ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్.
News Summary - ys jagan meeting with bendapudi government school students
Next Story

