Fri Dec 05 2025 12:37:51 GMT+0000 (Coordinated Universal Time)
మందు బాబులకు షాకిచ్చిన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు
మద్యం ధరలపై కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం ధరలపై 15 శాతం పెంచుతూ

ఏపీలోని కూటమి ప్రభుత్వం మద్యం ధరలపై కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం ధరలపై 15 శాతం పెంచుతూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.99కి అమ్మే మద్యం బ్రాండ్లు, బీర్లకు ఈ ధర పెంపు వర్తించదు. మిగతా అన్ని రకాల మద్యంపై పెంచిన ధరలు వర్తిస్తాయి. పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి. ఇక రాష్ట్రంలో మద్యం విక్రయాలపై మార్జిన్ ను ప్రభుత్వం ఇటీవలే 14.5 నుంచి 20 శాతానికి పెంచింది. ఇప్పుడు 15 శాతం ధరల పెంపుతో మందుబాబులకు షాకిచ్చింది. దేశీయ తయారీ ఫారెన్ లిక్కర్, ఫారెన్ లిక్కర్ కేటగిరీ మద్యంపై అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధించనున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు అప్పట్లో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం విధించిన మద్యం ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఫిబ్రవరి 11 నుంచి 15 శాతం మేర ధరలు పెంచేందుకు ఎక్సైజ్ శాఖకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో తెలంగాణలోని బీరు ప్రియులు కాస్త ఎక్కువ డబ్బులు చెల్లించాల్సిందే. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఏఎం రిజ్వీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ సిఫారసుల మేరకు బీర్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రవాణాలో ఉన్న వాటితో సహా IMFL డిపోల వద్ద ఉన్న స్టాక్లను మంగళవారం నుండి సవరించిన MRP ధరతో విక్రయించనున్నారు.
యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (UBL) కింగ్ఫిషర్ బీర్ ధరలను 33.1 శాతం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో సరఫరాను కూడా తగ్గించేస్తామని తెలిపింది. కంపెనీల ఒత్తిళ్లను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం లేదని గత నెలలో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి అన్నారు. అయితే బీరు ధరలను 15 శాతం పెంచారు.
Next Story

