Tue Dec 16 2025 03:28:43 GMT+0000 (Coordinated Universal Time)
రహదారిపై ఎలుగుబంటి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం ఎగువ అహోబిలంలోనూ ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతుంది.

అడవిలో ఉండాల్సిన జంతువులు బయటకు వస్తున్నాయి. గ్రామాల్లో సంచరిస్తున్నాయి. దీంతో గ్రామాల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి దాడికి తీవ్ర గాయాల పాలైన గ్రామస్థులు ఆసుపత్రిలో చేరి నేటికీ చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం ఎగువ అహోబిలంలోనూ ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతుంది.
ఆలయానికి....
అహోబిలం నరసింహస్వామి ఆలయానికి వెళ్లే ప్రధాని రహదారిలో ఎలుగుబంటి సంచరిస్తోంది. దీనిని గమనించిన కొందరు భక్తులు తమ వీడియోలో బంధించారు. దీనిపై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ప్రధాన రహదారిలో ఎలుగుబంటి సంచరిస్తుండటంతో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు.
Next Story

