Fri Dec 05 2025 12:44:19 GMT+0000 (Coordinated Universal Time)
తప్పు చేస్తే పట్టించే బారికేడ్లు
పల్నాడు జిల్లా పోలీసులు ట్రాఫిక్ నియంత్రణతో పాటుగా నిఘా కోసం సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చారు.

పల్నాడు జిల్లా పోలీసులు ట్రాఫిక్ నియంత్రణతో పాటుగా నిఘా కోసం సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. బారికేడ్లకు కెమెరాలు పెట్టి, పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్ కూడళ్లలో బారికేడ్లు ఏర్పాటు చేశారు, వాటికి సీసీ కెమెరాలు అమర్చారు. దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. రాష్ట్రంలోనే ఇది మొదటి ప్రయత్నమని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. ఈ కెమెరాలకు విద్యుత్ అందించడానికి సోలార్ ప్లేట్లు ఉన్నాయి. అలాగే రెండు మైక్‌లు కూడా బిగించారు. నరసరావుపేటలోని కలెక్టరేట్ ఎదుట, రద్దీగా ఉండే కూడళ్లలో, రైల్వే స్టేషన్ రోడ్డులో వీటిని ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలను కూడా గుర్తిస్తున్నారు.
Next Story

