Sun Mar 15 2026 15:00:44 GMT+0530 (India Standard Time)
కోన రఘుపతి వివాదాస్పద వ్యాఖ్యలు
బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బాపట్ల పార్లమెంట్ ఎస్సీ రిజర్వుడు కావడం దురదృష్టకరమన్నారు

బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బాపట్ల పార్లమెంట్ ఎస్సీ రిజర్వుడు కావడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఒక సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సంతనూతలపాడు ను బాపట్ల పార్లమెంట్ లో కలిపారని, లేకుంటే పొన్నూరు తో కలిసి బాపట్ల ఓసీ పార్లమెంట్ గా ఉండేదని అభిప్రాయపడ్డారు.
నెల్లూరు కోసం...
నెల్లూరు ను ఓసీ రిజర్వ్డ్ నియోజకవర్గం చేయడం కోసం బాపట్ల ను ఎస్సీ రిజర్వ్ చేశారని కోన రఘుపతి అన్నారు. బాపట్ల పార్లమెంట్ ఎస్సీ రిజర్వ్ కావడం చారిత్రక తప్పిదమని ఆయన అన్నారు. కోన రఘుపతి వ్యాఖ్యల పై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలా మాట్లాడటం సరికాదని అంటున్నాయి. దళితులకు కోన రఘుపతి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Next Story

