Fri Dec 05 2025 12:45:06 GMT+0000 (Coordinated Universal Time)
నేడు మార్కాపురం బంద్
ప్రకాశం జిల్లాలో మార్కాపురంలో నేడు బంద్ జరగనుంది. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ బంద్ జరగనుంది

ప్రకాశం జిల్లాలో మార్కాపురంలో నేడు బంద్ జరగనుంది. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ బంద్ జరగనుంది. మార్కాపురంను జిల్లాగా ప్రకటించాలని కోరుతూ అఖిలపక్ష నేతలు నేడు బంద్ కు పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లాలో జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా జరగలేదని పలువరు ఆరోపిస్తున్నారు. సుదీర్ఘకాలంగా మార్కాపురంను జిల్లా గా ప్రకటించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో కలపడాన్ని.....
మార్కాపురం బంద్ సందర్భంగా పోలీసులు విస్తృత బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో పాటు కందుకూరులోనూ బంద్ కొనసాగనుంది. కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రకాశం జిల్లాకు సమీపంలో ఉండే కందుకూరును నెల్లూరులో ఎలా కలుపుతారని ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు కందుకూరు రెవెన్యూ డివిజన్ ను తొలగించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
- Tags
- markapuram
- bundh
Next Story

