Fri Dec 05 2025 12:57:17 GMT+0000 (Coordinated Universal Time)
Balineni Srinivas: క్లారిటీనే కాదు.. కౌంటర్లు కూడా.. బాలినేని చెప్పేశారుగా!!
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వైసీపీని వీడి.. జనసేనలో చేరుతున్నారంటూ

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వైసీపీని వీడి.. జనసేనలో చేరుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై బాలినేని మాట్లాడుతూ.. తాను జనసేన పార్టీలోకి వెళ్తున్నానన్నది కేవలం ఊహాగానాలు మాత్రమేనన్నారు. అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వచ్చాయని.. ఎన్నికలకు ముందు ఇవే తన చివరి ఎన్నికలని చెప్పానన్నారు.
నేను ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరిని ఇబ్బందులకు గురి చేయలేదన్నారు బాలినేని. తన చేతనైన వరకు ప్రజలకు సహాయం చేశానని.. అధికారంలో ఉన్నప్పుడు ప్రతీపక్షంలో ఉన్న నేతలను ఎవరిని ఇబ్బంది పెట్టలేదన్నారు. నేను రాజకీయం వద్దు అనుకున్నా కానీ మా కార్యకర్తలపై దాడులు చేశాక మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానాని అన్నారు. నేను అధికారంలో ఉన్నప్పుడు నా పై ఆరోపణలు చేశారు.. వాటిని ఇప్పుడు నిరూపించండని సవాల్ విసిరారు. వైసీపీ నేతలు టీడీపిలోకి వెళ్ళాక మంచోళ్ళు అయ్యారా అని ప్రశ్నించారు. నేను ఒంగోలులోనే ఉంటా.. పార్టీ మారేది లేదని తేల్చి చెప్పారు బాలినేని.
Next Story

