Thu Mar 19 2026 04:27:07 GMT+0530 (India Standard Time)
నేడు వంశీ బెయిల్ పిటీషన్ పై విచారణ
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది.

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో మరోసారి విచారణ జరపనుంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో విజయవాడ జిల్లా జైలులో వల్లభనేని వంశీ రిమాండ్లో ఉన్నారు. అయితే తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన వేసిన పిటీషన్ పై నేడు న్యాయస్థానంలో విచారణ జరగనుంది.
ఈ కేసులో...
వల్లభనేని వంశీ పై కేవలం సత్యవర్థన్ కిడ్నాప్ కేసు మాత్రమే కాదు. చాలా కేసులున్నాయి. ఒక కేసులో బెయిల్ వచ్చినా మరొక కేసులో పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. ఆయనపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు గన్నవరం పోలీసులకు అందడంతో వారు వరస కేసులు నమోదు చేశారు. ఇసుక, మైనింగ్ అక్రమతవ్వకాల కేసులు నమోదయ్యాయి.
Next Story

