Wed Jan 28 2026 21:04:59 GMT+0000 (Coordinated Universal Time)
Vallabhaneni Vamsi : నేడు వల్లభనేని వంశీ బెయిల్ పై విచారణ
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటీషన్ పై నేడు సీఐడీ కోర్టులో విచారణ జరగనుంది.

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటీషన్ పై నేడు సీఐడీ కోర్టులో విచారణ జరగనుంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో గనకు బెయిల్ ఇవ్వాలంటూ వల్లభనేని వంశీ బెయిల్ పిటీషన్ వేశారు. దీనిపై నేడు విచారణ జరగనుంది. వల్లభనేని వంశీ ఇప్పటికే సత్యవర్థన్ ను కిడ్నాప్ చేసిన కేసులో అరెస్టయి విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
వరస కేసులు...
వల్లభనేని వంశీపై వరసగా కేసులు నమోదు అవుతున్నాయి. మైనింగ్, అక్రమంగా ఇసుక తవ్వకాల వంటి ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నారు. భూకబ్జాలు చేసినట్లు కూడా ఆయనపై ఫిర్యాదులు అందడంతో వరస కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ వస్తుందా? రాదా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story

