Tue Mar 03 2026 14:05:46 GMT+0530 (India Standard Time)
క్షేమంగా భారత్ కు చేరుకున్న పీవీ సింధు
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూ క్షేమంగా భారత్ కు చేరుకున్నారు

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూ క్షేమంగా భారత్ కు చేరుకున్నారు. ఈ మేరకు సింధూ ఎక్స్ లో పోస్టు చేశారు. పీవీ సింధూ దుబాయ్ కు వెళ్లి గత కొన్ని రోజులుగా చిక్కుకుని పోయారు. ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం కారణంగా దుబాయ్ ఎయిర్ పోర్టును కూడా మూసివేయడంతో పీవీ సింధూ దుబాయ్ లోనే ఉండి పోవాల్సి వచ్చింది.
బెంగళూరు ఎయిర్ పోర్టుకు...
అయితే పీవీ సింధూ నేడు క్షేమంగా బెంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. తాను క్షేమంగా బెంగళూరుకు చేరుకున్నానని, రెండు రోజుల విశ్రాంతి తీసుకున్న తర్వాత అన్ని విషయాలు మాట్లాడతానని పీవీ సింధూ చెప్పారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు సిబ్బందికి, అధికారులకు పీవీ సింధూ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
Next Story

