Sun Mar 08 2026 07:36:13 GMT+0530 (India Standard Time)
ఈ నెల 8 వరకూ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలను ఈ నెల 8వ తేదీ వరకూ నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలను ఈ నెల 8వ తేదీ వరకూ నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. బీఏసీ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈరోజు ప్రారంభమైన సమావేశాలను ఈ నెల 8వ తేదీ వరకూ నిర్వహించాలని నిశ్చయింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై చర్చ జరగనుంది.
పలు కీలక బిల్లులకు...
దీంతో పాటు పలు కీలక బిల్లులను ఆమోదించేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం చిట్ట చివరి సమావేశాలు కూడా కావడంతో కీలక బిల్లులు ప్రవేశ పెట్టే అవకాశముంది. బీఏసీ సమావేశంలో చర్చించిన మేరకు నాలుగు రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. బీఏసీ సమావేశాలకు హాజరైన టీడీపీ నేతలు మధ్యలో బహిష్కరించి వెళ్లిపోయారు.
Next Story

