Wed Mar 18 2026 16:36:00 GMT+0530 (India Standard Time)
పొత్తులపై అయ్యన్న కామెంట్స్ వైరల్
అయ్యన్న పాత్రుడు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి

అయ్యన్న పాత్రుడు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రామాయణంలో రావణుడిని వధించడానికి శ్రీరామ చంద్రుడు అందరి సాయం తీసుకున్నట్లే వచ్చే ఎన్నికల్లోనూ అందరి సాయం తీసుకోవాలని ఆయన కోరారు. తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో అయ్యన్న పాత్రుడు పొత్తులపై పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
రావణుడి వధలో....
రావణుడిని వధించేటప్పుడు రాముడు ఉడత నుంచి కోతుల సాయం కూడా తీసుకున్నారని అయ్యన్న పాత్రుడు అన్నారు. అదే తరహాలో ఇప్పుడు కూడా జగన్ రెడ్డిని గద్దె దించడానికి అందరి సాయం తీసుకోవాలని, రాముడు బలవంతుడైనా, భగవంతుడైనా అందరి సాయం తీసుకున్నారని, అదే మాదిరిగా చంద్రబాబు కూడా తగిన నిర్ణయం సరైన సమయంలో తీసుకుంటారని తాను ఆశిస్తున్నట్లు ఆయన పార్టీ సమావేశంలో వ్యాఖ్యానించారు.
Next Story

