Thu Jan 16 2025 00:40:58 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ వాళ్లకు ప్రత్యేక జూమ్ కాన్ఫరెన్స్
పదోతరగతి ఫెయిల్ అయిన వైసీపీ నాయకుల కోసం ప్రత్యేక జూమ్ కాన్ఫరెన్స్ త్వరలోనే నిర్వహిస్తామని అయ్యన్న తెలిపారు
వైసీపీ నేతలకు సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు సవాల్ విసిరారు. 20 - 30 ఏళ్ల క్రితం పదోతరగతి ఫెయిల్ అయిన వైసీపీ నాయకుల కోసం ప్రత్యేక జూమ్ కాన్ఫరెన్స్ త్వరలోనే నిర్వహిస్తామని అయ్యన్న తెలిపారు. పరీక్ష పత్రాలు కొట్టేసిన జగన్ తో పాటు పరీక్ష తప్పిన వైసీపీ నాయకులందరూ ఆహ్వానితులేనని ట్వీట్ చేశారు. తాను స్వయంగా జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి అందరికీ నచ్చే విధంగా వైసీపీ ప్రత్యేక భాషలోనే మాట్లాడతానని అయ్యన్న పాత్రుడు చెప్పారు.
పారిపోయావు కదా?
మరోవైపు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా ట్వీట్ చేశారు. లోకేష్ ను ఎద్దేవా చేస్తూ ఈ ట్వీట్ చేశారు. జూమ్ లోకి వస్తేనే మ్యూట్ చేసి పారిపోయావని, నేరుగా రమ్మని సవాల్ విసిరావే... డైరెక్టగా వస్తే తట్టుకోగలవా? లోకేశం? అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. చిన్న పిల్లలతో రాజకీయం చేయడం కాదని, పోయి పప్పు తినిపడుకో చిట్టయ్యా అని సాయిరెడ్డి తన ట్వీట్ లోపేర్కొన్నారు.
Next Story