Sun Mar 15 2026 04:24:42 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : నేడు స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు నేడు పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు నేడు పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. నిన్న స్పీకర్ పదవికి అయ్యన్న ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమయింది. ఈరోజు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి శాసనసభ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఎన్నికయినట్లు ప్రకటించనున్నారు.
ఉదయం పదకొండు గంటలకు...
నేడు ఉదయం పదకొండు గంటలకు స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. రెండో రోజు శాసనసభ సమావేశాల ప్రారంభమయిన వెంటనే మిగిలిపోయిన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు.
Next Story

