Fri Dec 05 2025 09:33:08 GMT+0000 (Coordinated Universal Time)
బాడీ బిల్డిండ్ పోటీల్లో సిక్కోలు వాసి
మిస్టర్ ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డింగ్ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా యువకుడు అవినాష్ ద్వితీయ స్థానంలో నిలిచాడు

మిస్టర్ ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డింగ్ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా యువకుడు అవినాష్ ద్వితీయ స్థానంలో నిలిచాడు. మిస్టర్ ఆంధ్ర ఓపెన్ బాడీ బిల్డింగ్ మరియు మెన్స్ ఫిజిక్ లో శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురం యువకుడు కొండ అవినాష్ ఈ ఘనతను సాధించారు. హరిపురం గ్రామంలోని ఏ వన్ ఫిట్ నెస్ జిమ్ తరుపున కొండ అవినాష్ గడిచిన ఆదివారం ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో జరిగిన మిస్టర్ ఆంధ్ర ఓపెన్ బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొన్నారు.
ద్వితీయ బహుమతిని...
ఇరవై ఏడేళ్ల అవినాష్ బాడీ బిల్డింగ్ లో ప్రతిభ కనబరిచి ద్వితీయ బహుమతి కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా కోచ్ శివ మహరణ,కోట శ్రీకాంత్,రవి దాలాల్ లు హర్షం వ్యక్తం చేశారు. కాగా అవినాష్ ముంబైలో జరగబోయే నేషనల్ బాడీ బిల్డింగ్ పోటీలకు ఎంపిక కావడం మరో శుభపరిణామం. ఈ సందర్భంగా పలువురు మందస మండల వాసులు అవినాష్ కు ప్రశంసించారు.
Next Story

