Fri Jan 09 2026 04:31:26 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి విజయవాడలో ఆవకాయ్ అమరావతి
నేటి నుంచి విజయవాడలో ఆవకాయ్ అమరావతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి

నేటి నుంచి విజయవాడలో ఆవకాయ్ అమరావతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం ఐదు గంటలకు సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.కార్యక్రమంలో పవన్ కల్యాణ్, మంత్రులు పాల్గొననున్నారు. మూడు రోజుల పాటు అమరావతి ఆవకాయ్ వేడుకలు కొనసాగనున్నాయి. ఈ వేడుకల నిర్వహణను ఏపీ ప్రభుత్వం ఘనంగా తీసుకుంది.
హోమ్ బోట్లు...
ఉత్సవాల్లో సినీ, సాహిత్యరంగ ప్రముఖులు పాల్గొననున్నారు. ఉత్సవాల్లో భాగంగా కృష్ణా నదిలో హౌస్బోట్ల ప్రారంభించనున్నారు. కృష్ణానదిలో కేరళ తరహా ఫ్లోటెడ్ హోమ్ బోట్లు ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ బోట్ ఒక కుటుంబానికి రోజుకు ఎనిమిది వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుది. ఈ బోట్లను నేడు పున్నమిఘాట్ దగ్గర చంద్రబాబు ప్రారంభించనున్నారు.
Next Story

